విద్యార్థిని,విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణి చేయడ అభినందనీయం యన్స్‌ క్లబ్స్‌ సేవలు ప

Published: Friday July 08, 2022
కరీంనగర్ జూలై 7 ప్రజాపాలన ప్రతినిధి :
 
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుక్స్‌ అందించడం హర్షదాయకమని, ఇలాంటి పలు సేవల ద్వారా జన్మభూమి రుణం తీసుకోవాలని సూచించారు.
గురువారం కలెక్టర్ క్యాంపు ఆఫీసు సమావేశ మందిరంలో నిర్వహించిన లయన్స్‌ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న లక్ష నోట్‌ పుస్తకాలను లాంఛనప్రాయంగా కలెక్టర్ ప్రారంభించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 
జిల్లా గవర్నర్‌ లయన్‌ రిక్కల నారాయన్‌ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ముఖ్య సేవల్లో స్వంత మొబైల్‌ వాహనం ద్వారా ఉచిత అన్న వితరణ, అతి తక్కువ ధరలకు డయాగ్నాస్టిక్‌ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, రేకుర్తి లో ఉచిత కంటి ఆసుపత్రి సేవలు, పలు సమాజహిత సేవలు, డయాబెటిక్‌ ఉచిత పరీక్షలు, పర్యావరణ పరిరక్షణ సేవలు, విద్యార్థుల్లో విలువలు పెంచే లయన్స్‌ క్వెస్ట్‌ శిక్షణలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, యువతకు నైపుణ్య వికాస కార్యక్రమాలు లాంటి అనేక సేవలను 85 క్లబ్బుల ద్వారా 2900 లయన్ సేవకులు నిరంతరం చేయడం జరుగుతోందని వివరించారు.ఈ కార్యక్రమంతో  ప్రముఖ లయన్స్‌
డా.గుర్రం శ్రీనివాస్ రెడ్డి, నాగుల సంతోష్‌, హనుమాండ్ల రాజి రెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వర్‌ రావు, డి. నారాయణ రావు, డి.కె.రాజలింగం, డా. కెప్టెన్‌ బుర్ర మధుసూదన్‌ రెడ్డి, యం. భద్రేషం, సింహరాజు కోదండరాములు, గుంటుక ప్రకాష్‌, చెవిటి సుదర్శన్‌, సాయినేని నరెందర్‌, ఇనుగుర్తి రమేశ్‌, వడుకాపురం జగదీశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.