300 మంది విద్యార్థులతో పాటకు అనుగుణంగా నృత్యం

Published: Tuesday October 18, 2022
 సిఎండి స్వర్ణ గ్రూప్ వైస్ చైర్మన్ సాయి వెంకట్
వికారాబాద్ బ్యూరో 17 అక్టోబర్ ప్రజా పాలన : 300 మంది విద్యార్థులతో ఎనిమిది నిమిషాలలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడం అభినందనీయమని ప్రొడ్యూసర్ సెక్టర్ తెలుగు ఫిలిం చాంబర్ సిఎండి స్వర్ణ గ్రూప్ వైస్ చైర్మన్ సాయి వెంకట్ కొనియాడారు. ఆదివారం రవీంద్రభారతిలో విశ్వం వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2022 కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగింది. 153 వ గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మయూరి ఆర్ట్స్ వారు నిర్వహించిన సింగింగ్ అండ్ డాన్సింగ్ దేశభక్తి పాటను ఎనిమిది నిమిషాలలో పూర్తి చేయడం విశేషం అని ప్రశంసించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైస్ చైర్మన్ ప్రొడ్యూసర్ సెక్టర్ తెలుగు ఫిలిం చాంబర్ సిఎండి స్వర్ణ గ్రూప్ సాయి వెంకట్, గౌరవ అతిథులు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మామిడి హరికృష్ణ టీవీ అండ్ ఫిల్మ్ సీనియర్ ఆర్టిస్ట్ ఎం శైలజ సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ కళా రత్న మల్లం రమేష్ ఈటీవీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీక్ రికార్డ్ న్యాయమూర్తులు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ నరేంద్ర విశ్వం వరల్డ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ అడ్లగట్ గంగాధర్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నుండి ఆర్ఎన్డి స్టూడియో నుండి గురువు నాగజ్యోతి తన శిష్య బృందం ఎస్ అక్షయ బి శ్రీ పూజ పి శరణ్య కే రాజశ్రీ బి అద్విక బి స్వర్ణ ఎం ఆశ్రిత శ్రీ సింధు కే రజ్ఞ ఎస్ సంధ్యారాణి ఎస్ శ్రీనిత ఏ అక్షయ కే నందిని యస్ సాన్వి శ్రీదివ్య ఆరాధ్య వెళ్లి నృత్యం చేసి విశ్వం వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడంతో పాటు ఇండియన్ ఐకాన్ అవార్డ్ 2022 అందుకున్నారు.
 
 
 
Attachments area