జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా మట్టి విగ్రహాల పంపిణీ. క్యాతనపల్లి ఆగస్టు30. ప్రజాపాలన ప్రతినిధి.

Published: Thursday September 01, 2022
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం  జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా మట్టి వినాయక విగ్రహాలను రామకృష్ణాపూర్ లోని రాజీవ్ చౌక్ నందు ఉచితముగా ఇవ్వడము జరిగినది. ఇందులో భాగంగా జి ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణలో నిమగ్నమై ఉన్న మన భారతదేశము తెలంగాణ ప్రభుత్వము ఎన్నో పద్ధతులను అవలంబిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే దానిలో భాగంగా జి ఎస్ ఆర్ ఫౌండేషన్ తన వంతు బాధ్యతగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకున్నారు. గాలి నీరు ఆహారం ఇలా పోల్చుకుంటే ప్రతి ఒక్కటి కలుషితమై పోయాయని ఇలానే వదిలేస్తే మన భవిష్యత్తు తరాల వారు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని మనతో సాధ్యమైనంత వరకు పర్యావరణాన్ని రక్షించుకుందాం అని దానిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వీధుల్లో విగ్రహాల సంఖ్య పెంచుతూ పోతూ వ్యక్తుల మధ్య దూరం అవడమే తప్ప మరీ ఇంకొకటి లేదని అలా కాకుండా కాలనీవాసులు అందరూ కలిసి ఒక దగ్గరే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పండగ వాతావరణం లో అందరూ కలిసి 9 రోజులు ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేకల రాజయ్య .సురేష్ .బద్రి సతీష్. కన్నారావు. కిరణ్ కుమార్. వెంకన్న. వేణు. రవి. శీను. జనతాగ్ని. కిషోర్ .శశి .శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area