మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన మలబార్ గోల్డ్ హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Wednesday June 15, 2022

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంగళవారం సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సంస్థతో కలిసి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మెగా రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు షోరూమూలకు వాలంటీర్లను స్వాగతించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ.హెచ్.వో) ఇతివృత్తం రక్తదానం చెయ్యడం ఐకమత్యానికి చిహ్నం, ఈ ఉద్యమంలో చేరండి ప్రాణాలను రక్షించండి అనే అంశానికి బలం చేకూర్చేలా రక్తదాతల సంఖ్యను పెంచే ఆవశ్యకతపై దృష్టి సారించింది. దీర్ఘకాలిక వ్యాధులు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స చేయడంలో దానం చేసిన రక్తం సహాయపడుతుంది. బాధ్యతాయుతమైన వ్యాపార సంస్థగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సామాజిక సేవా కార్యక్రమాలకు తమ లాభాలలో 5 శాతం స్వచ్ఛంద, దాతృత్వ కార్యకలాపాలకు కేటాయిస్తుంది. వైద్యం, పర్యావరణ పరిరక్షణ, గృహ నిర్మాణం, విద్య, మహిళా సాధికారత వంటి ముఖ్యమైన రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై మలబార్ గ్రూపు దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమంలో సోమజిగూడా స్టోర్ హెడ్స్ మహమ్మద్ షేర్జ్జ్ ,రేజాయ్, జిజిష్, మేనేజర్ కిషన్ రావు,  నజీమ్, నవీన్  తదితరులు పాల్గొన్నారు.