తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్ర

Published: Tuesday October 04, 2022
 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  సోమవారం నాడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు, అనంతరం అక్కడ ఏర్పాటు చేస్తున్న బతుకమ్మ పాటలకు అనుగుణంగా డాన్స్ లు వేశారు..
 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ 

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రకృతిని ప్రేమించి, పూలను పూజించే పండుగ తెలంగాణకు మాత్రమే సొంతమని ఇదొక గొప్ప వేడుకని అన్నారు, సద్దుల బతుకమ్మ కావడంతో తెలంగాణ ఆడపడుచులు అందరికీ ప్రజలకు ప్రత్యేకంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు, ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు, తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ విజయవంతంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ గారు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారన్నారు, తెలంగాణ సాంస్కృతి  సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించి ప్రతి దసరా పండుగకు రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేస్తూ ప్రతి ఒక ఆడబిడ్డకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని అన్నారు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంటే ముందు వ్యవసాయానికి సరిపడే విద్యుత్తు లేక అవస్థలు పడేవారని, రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత  సీఎం కేసీఆర్ గారికే దక్కుతున్నది అన్నారు.