ఉత్తమ ఇంజనీర్ కంగ్టి మండలం పిఆర్ అసిస్టెంట్ ఇంజనీర్ జి.మాధవనాయుడు

Published: Monday September 19, 2022
హైదరాబాద్ 18 సెప్టెంబర్ ప్రజాపాలన: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ 
ఇంజనీర్స్ డే సందర్భంగా పలువురు ఇంజనీర్లను సత్కరించారు.
సంగారెడ్డి జిల్లా  జెఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162 వ జయంతిని పురస్కరించుకుని 55వ  ఇంజనీర్స్ డే  సందర్భంగా జిల్లా లో పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లను ఆదివారం ఘనంగా సత్కరించారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశం  ఆదివారం నాడు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగింది.
నారాయణ ఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం లో పనిచేస్తున్న పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ గంగవరపు మాధవనాయుడు ను బెస్ట్ ఇంజనీర్ గా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గుర్తించింది. శాలువా తో సన్మానించి లయన్స్ క్లబ్  జ్ఞాపికను అందజేశారు.   
ఆందోల్ మండలం పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ తొంట మొగులయ్య ఉత్తమ ఇంజనీర్ గా అవార్డు అందుకున్నారు. పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తుమ్మలపల్లి 
జగదీశ్వర్ మరియు చేగుంటలో  సైట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విజయ్ తదితరులను ఇంజనీర్స్ డే సందర్భంగా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు.