ఏపురి సోమన్న పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి వైయస్సార్ తెలం

Published: Thursday July 07, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి  

మంచాల మండలం కేంద్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షలో ప్రజా సమస్యలపై తన గానంతో ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రజా గాయకుడు ఏపురి సోమన్న పై కొంత మంది T R S గుండాలు దాడి చేయటని త్రివంగా ఖండిస్తున్నాం ప్రజా స్వామ్యం లో ప్రజా సమస్యలపై ప్రభుత్వం పై పోరాటం చేసే హక్కు ప్రతి పౌరునికి ఉంట్టుంది  అని T R S నాయకులు గుర్తు తెచ్చుకోవాలి అన్నారు ఏపురి సోమన్న ఒక పార్టీ కి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రజా గాయకుడు తనదైన శైలిలో ప్రభుత్వని స్థానికంగా ఉండే నాయకులను విమర్శిస్తూ పోరాటం చేస్తాడు తన పాట ద్వారా ప్రజలకు వివరిస్తాడు ఆ హక్కు సోమన్నకు ఉంది అన్నారు.నిజమైన నాయకులు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయకంగా విమర్శకు ప్రతి విమర్శ చేసి ఎదుర్కొవాలి కానీ పిరికి పందాల దాడులు చేయటం సరైన పద్ధతి కాదు అన్నారు            ప్రజా గాయకుడు దళిత జాతి ముద్దు బిడ్డ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపురి సోమన్న పై కొంత మంది టిఆర్ఎస్ గుండాలు దాడి చేయటం మహా దారుణం అన్నారు ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో భాగంగా ఒక  అడ బిడ్డ ఎండ అనక వాన అనక ప్రజా సమస్యలు తెలుసుకుంటు ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న వైయస్ షర్మిలకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రామ్మ రథం పడుతున్నారు అని తట్టుకోలేకనే  టిఆర్ఎస్ నాయకులు అక్కడ అక్కడ దాడులు చేయిస్తున్నారు అన్నారు ఎవ్వరు ఎన్ని దాడులు చేసిన వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఎవ్వరు బయ పడరు.మళ్ళీ దాడులు చేస్తే దాడికి ప్రతి దాడి చేయడానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులం సిద్ధంగా ఉంటాం అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైన ప్రజా సమస్యలపై ముందుగా పోరాటం చేస్తున్న నాయకురాలు వైయస్ షర్మిల అన్నారు తెలంగాణ రాష్ట్రం లో వైయస్ షర్మిలకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక నే తెర వెనుక ఉండి టిఆర్ఎస్ నాయకులు దాడులు చేయిస్తున్నారు అన్నారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏపురి సోమన్న పై దాడి చేసిన  టిఆర్ఎస్ పార్టీ నాయకులను వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయాలి మళ్ళీ ఇలాంటి దాడులు చేయకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతట ఆందోళనలు చేస్తాం అని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో
.మంచాల మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్

నాయక్.యండి. వాహిద్ బాయి సీనియర్ నాయకుడు.బనవత్. సుధాకర్ నాయక్ బూడిద. మహేందర్, ముఖేష్ గౌడ్,
తదితరులు పాల్గొన్నారు 
 
 
 
Attachments area