బెస్ట్ పోస్ట్ మాన్ అవార్డు గ్రహీత బీజ్జాల శేషు

Published: Monday February 15, 2021
మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన : పోస్ట్ మాన్ గారికి  వికాస తరంగిణి, మధిర శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం     *2019-2020 ఆర్థిక సంవత్సరం కు సంబంధించి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు భారతీయ తపాల శాఖ ప్రతి సవత్సరం అందించే అవార్డ్ లో బాగంగా , ఈ సంవత్సరం ఉత్తమ పోస్ట్ మాన్ కేటగిరీ లో తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన పోస్ట్ మన్ , శ్రీ బీజ్జాల శేషు, మధిర పోస్ట్ మాన్ కు.... అతని విశిష్ట సేవలకు గుర్తింపు గా డాక్ సేవ అవార్డ్ ప్రకిటించారు.. మధిర పోస్ట్ మాన్..... కు అభినందనలు...2008 లో పాత పాల్వంచ పోస్ట్ ఆఫీస్ కు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా సెలెక్ట్ అయిన దగ్గర నుండి తనదైన శైలి లో సేవలందిస్తూ అనేక అవార్డు లు రివార్డ్ లు అందుకున్న శ్రీ శేషు గారు.... 2017 అక్టోబర్ లో విడుదలైన ప్రమోషన్ ఫలితాలలో సైతం టాప్ లో సెలెక్ట్ ఐ ప్రమోషన్ మీద మధిర పోస్ట్ office కు వచ్చారు.... ఈ క్యాడర్ లో సైతం విశిష్ట సేవలు కొనసాగిస్తూ.... మధిర పట్టణ ప్రజలకు మరియు చుట్టు పక్కల గ్రామ ప్రజలకు అనేక రకాల పోస్టల్ సేవలు అందిస్తూ తనదైన ముద్ర తో జాయిన్ అయిన దగ్గర నుండి అనేక అవార్డ్ లు సొంతం చేసుకున్నారు.. 2019 లో ఢిల్లీ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ శ్రీ సంధ్య రాణి మేడం చేతుల మీద గా డివిజనల్ బెస్ట్ పోస్ట్ మాన్ అవార్డ్ సైతం సొంతం చేసుకున్నారు. ఈ దశలో ఈ రోజు విడుదలైన శ్రీ చీఫ్ పోస్ట్ మాస్టారు హైదబాద్ వారి ప్రకటనలో సైతం తెలంగాణ మొత్తం లో ఎంపికైన ఒకే ఒక పోస్ట్ మాన్ గా తన కెరీర్ లో మరో కలికి తురాయిని సొంతం చేసుకున్నారు....*.         *చేసేది ఏ స్థాయి ఉద్యోగం అనేది కాకుండా అంకితభావంతో పని చేస్తే తగిన గుర్తింపు వస్తుందని రుజువు చేశారు బీజ్జాల శేషు.              * బీజ్జాల శేషు గారి విశిష్ట సేరత ప్రభుత్వం డాక్ సేవక్ అవార్డు వచ్చిన సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వికాస తరంగిణి మధిర శాఖ అధ్యక్షులు కుంచం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బీజ్జాల శేషు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది*.   ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి మధిర శాఖ అధ్యక్షులు కుంచం కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి కోమటీడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చారుగుండ్ల నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు చెడే రామకోటేశ్వరరావు, ధ్యాన చక్ర హీలింగ్ పీఠం వ్యవస్థాపకులు మహంకాళి రామకృష్ణ తిలక్, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం చైర్మన్ కపిలవాయి జగన్మోహన్ రావు, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు శ్రీ ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, కళ్యాణ మండపం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కురువెళ్ళ వెంకట పురుషోత్తమరావు (కృష్ణ) గారు,  మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండెల సూర్యప్రకాశరావు గారు తదితరులు పాల్గొన్నారు
Attachments area