స్మశాన వాటిక కు సరైన సదుపాయాలు లేవుని వినతి

Published: Wednesday June 09, 2021
బాలపూర్, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : గుర్రం గూడాలో స్మశాన వాటిక అభివృద్ధి పనుల గురించి కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డికి దడిగ శంకర్ వినతి. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రం గూడా 6వ డివిజన్ కార్పొరేటర్ దడిగ శంకర్ ఆధ్వర్యంలో స్మశాన వాటిక గురించి గుర్రంగూడ లో 40 నుండి 50 కాలనిలలు వరకు ఇప్పుడు ఉన్నాయని జనాభా 15 వేల వరకు జీవనం సాగిస్తున్న వారందరికీ స్మశాన వాటిక కు పోవుటకు దారికుండ  సరిగ్గాలేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డికి స్థానిక కార్పొరేటర్ వినతి పత్రాన్ని సమర్పించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.... గ్రామపంచాయతీ నుండి నగర పంచాయతీగా అభివృద్ధి చెంది, ఆ తర్వాత నగరపాలక సంస్థలో విలీనమైనప్పటికీ గుర్రం గూడా గ్రామంలో ఇప్పటికి సరైన సదుపాయాలలో స్మశాన వాటిక కు లేకపోవడం బాధాకరంగా ఉందని కాలనీ వాసులందరూ వాపోతున్నారని అన్నారు. వివిధ కాలినిలల్లో జనాభాతో అధిక వేగంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రజలు ఎక్కడినుంచో వంద కిలో మీటర్ల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి జీవనం గడుపుతున్నారు. అనారోగ్య కారణంగానో, మరే ఇతర కారణాలతో ఎవరైనా మరణించినప్పుడు  సొంత ఊరికి తీసుకపోలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మరణించిన వారికి అంత్యక్రియలు చెయ్యాలంటే స్మశానవాటికి సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ రోజురోజుకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందిని, ఆ అభివృద్ధిలో భాగంగా మా గుర్రం గూడా గ్రామ ప్రజలను పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆరో డివిజన్ సర్వే నెంబర్ 92 (3.02, మూడు ఎకరాల రెండు గుంటలు) స్మశాన వాటికను అన్ని రకాలుగా స్త్రీ, పురుషులకు టాయిలెట్స్ గదులు, స్థానపు గదులు, స్మశాన వాటిక చుట్టు ప్రహరి గోడ నిర్వహించవలసిందిగా కోరుతూ స్థానిక కార్పొరేటర్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డికి వినతి.