గ్రామీణ వైద్య సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు

Published: Monday June 20, 2022

బోనకల్, జూన్ 19 ప్రజా పాలన ప్రతినిధి: మండలం లో వైద్యుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామీణ వైద్య సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ బోయినపల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని రాయనపేట గ్రామంలో ఆదివారం జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం షేక్ ఖాసీం ఎస్వీ రామారావు అద్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుతో గ్రామీణ వైద్యులకు ఒరిగేదేమీ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.గ్రామీణ వైద్యులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలంటే రాబోయే రోజుల్లో గ్రామీణ వైద్య సంఘాలన్నీ ఏకమై బలమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారమౌతాయని గుర్తుచేశారు. గ్రామాల్లో పేదప్రజలకు అతి తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం లేని గ్రామాల్లో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యుల తలరాతలు మారడం లేదని వాపోయారు.ఈకార్యక్రమంలో ఆర్ఎంపిడబ్యూఏ మండల అధ్యక్ష,కార్యదర్శులు కిషోర్, శీవ, సీనియర్ నాయకులు కొంగర గోపి, ముజీబ్ ఎర్రుపాలెం మండలద్యాక్షుడు పుల్లారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి గండరాపు రామారావు, జిల్లా కమిటీ సభ్యులు షేక్ నాగుల్ మీరా, అక్కినపల్లి నాగేశ్వరరావు, సైదులు, శ్రీరాములు , అంజి ,వినయ్ తదితరులు పాల్గొన్నారు.