ప్రజాపాలన షాబాద్:::--* *షాబాద్ మండల్ కక్కులూర్

Published: Tuesday January 10, 2023

గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అదితిగా విచ్చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య రిబ్బన్ కట్ చేసి ఇరుజట్ల కెప్టెన్ల ముందు టాస్ వేయించి ఆటను ప్రారంభించి కాసేపు సరదాగా ఆటలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి చాలా ముఖ్యమైనవి ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శరీరం దృఢంగా ఉంటుంది తద్వారా రోజంతా ఉల్లాసంగా మనం చేసే పనిలో కూడా చురుకుగా పాల్గొనడం జరుగుతుంది అందుకని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయించాడు అని అన్నారు* *అదేవిధంగా సర్పంచ్ మమతా జీవన్ రెడ్డి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మదుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి ఎంత దోహదం   చేస్తాయి  మా చిన్నతనంలో ఎన్నో రకాలైన ఆటలు ఆడేవారమని అకాలంలో ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడేవారని ఇప్పుడున్న జనరేషన్ ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు అందుకనే మనోధైర్యం కోల్పోయి చిన్న చిన్న కారణాలకే సూసైడ్ వరకు వెళ్తున్నారని అన్నారు మా గ్రామంలో ఇప్పటినుంచి యువకులు  క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకొని ఆటలే కాకుండా కానిస్టేబుల్ పోస్టులకు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి  లైటింగ్ సౌలభ్యం కూడా కల్పిస్తామని అన్నారు* *ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మమతా జీవన్ రెడ్డి, డిప్యుటీ సర్పంచ్ కలల్ నర్సింలు గౌడ్, ఎంపిటిసి కర్ణాకర్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్,మధుసూదన్ రెడ్డి ,జనార్దన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కృష్ణయ్య గౌడ్, మంగలి శ్రీనివాస్,రమేష్, యాదగిరి, యాదయ్య, కృష్ణయ్య భాస్కర్, నర్సింలు బాలరాజ్, బలరాం,కృష్ణ ఎస్సై బల్ రాజు  తదితరులు పాల్గొన్నారు*