ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి **ప్రగతి నివేదన యాత్ర ** ప్రతి అడుగు ప్రజల కో

Published: Tuesday February 28, 2023

గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి బంటి  బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ప్రగతి నివేదన యాత్రతో నేటికీ 36రోజులు, 65గ్రామాలు, 475కిలోమీటర్లు పూర్తి చేసుకుని పాదయాత్ర గా మీ గ్రామానికి వచ్చాను.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని గత 3ఎన్నికల్లో ఓట్లేసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకోవాలని, వాటిని నాదృష్టికి తీసుకురావాలని, పరిష్కరిద్దామని ఎమ్మెల్యే  చెప్పటంతో ఈరోజు మీగ్రామానికి వచ్చానని అన్నారు.గత 8సంవత్సరాలుగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని తెలియజేయడానికే మీ ముందుకు వచ్చానని అన్నారు.
గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2లక్షల పనులు శాంక్షన్ చేసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు కేసీఆర్  ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని అన్నారు.ఇబ్రహీంపట్నం నుండి ఎలిమినేడు మీదుగా మీ గ్రామానికి నూతన రోడ్డు నిర్మాణం జరుగుతుందో ఆ రోడ్డుకి దాదాపు 60కోట్ల రూపాయలతో నిర్మాణం చేశామని, మంగళ్ పల్లి నుండి కొంగర వరకు రోడ్డు మరమ్మత్తుల కొరకు 7కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వచ్చే నెల రోజుల్లోనే పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.మంగళ్ పల్లి లో వివిధ అభివృద్ధి పనులకు 2కోట్ల 11లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ద్వారా చుట్టుపక్కల ఉన్న చెరువుల మరమ్మత్తుల కొరకు 10లక్షల రూపాయలు,గ్రామంలో మహిళలు కష్టపడద్దని సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథలో భాగంగా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ల కోసం 4కోట్ల 42లక్షలు ఖర్చు చేశారు.
గ్రామంలో 181 మంది లబ్ధిదారులకు నెలకు 3లక్షల 95వేల రూపాయలు ఫించన్లు వస్తున్నాయన్నారు.రైతుబంధు రూపంలో 653 మంది లబ్ధిదారులకు ప్రతి 6నెలలకు 65లక్షల 85వేల రూపాయలు వస్తున్నాయని తెలిపారు.కల్యాణలక్ష్మీ లేదా షాధిముబారక్ ద్వారా 70 మంది లబ్ధిదారులకు 65లక్షల 73వేలు, రైతు బీమా పథకంలో భాగంగా 3 రైతులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు 15లక్షల రూపాయలు అందించారన్నారు.కేసీఆర్ కిట్ రూపంలో 112 మంది లబ్ధిదారులకు 17లక్షల రూపాయలు కేటాయించారన్నారు.ముఖ్యమంత్రి సహాయనిధి 27 మంది లబ్ధిదారులకు 9లక్షల 40వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు.దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన చేతాళ్ల యాదగిరి, బంటి గారిని కలిసి, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి  నన్ను ఎంపిక చేసి నాకు కారు యూనిట్ ను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందని బంటి  అన్నారు.మహమాయమ్మ గుడి మరమ్మతుల కోసం 5లక్షల రూపాయలను ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు మంజూరు చేశారని బంటి గారు అన్నారు.