అంబులెన్స్ లోనే ప్రసవం

Published: Monday March 22, 2021
మధిర మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో ఊటుకూరు వసంత భర్త పేరు ప్రవీణ్ వయస్సు 22 సంవత్సరాలు ఈరోజు ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం ఇవ్వగా మధిర వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లంక సురేష్ పైలెట్ రాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పురిటి నొప్పులతో బాధపడుతున్న వసంతని అంబులెన్స్ లోకి ఎక్కించుకొని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకు వెళుతుండగా మార్గమధ్యలో వసంత నొప్పులు ఎక్కువ కావడంతో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లంక సురేష్ అంబులెన్స్ లో వసంత కు సుఖప్రసవం చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వసంత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెరుగైన వైద్యం కోసం  ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం జరిగింది. వసంత యొక్క బంధువులు మరియు హాస్పిటల్ సిబ్బంది, 108 సిబ్బందిని అభినందించారు..