బోనకల్ మండల బీజేపీ నాయకులు ముందస్తు అరెస్ట్

Published: Tuesday December 28, 2021
బోనకల్, డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరగనున్న నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ దీక్షకు బయలుదేరిన జిల్లా మరియు బోనకల్ మండల బిజెపి నాయకులను మండల ఎస్సై తేజావత్ కవిత, ఏ ఎస్ ఐ వెంకట నారాయణ ముందస్తుగా అరెస్టు చేసినారు. అరెస్టయినవారిలో బీజేవైఎం మండల అధ్యక్షులు కాలసాని పరశురాం, జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ నాగేశ్వరరావు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవి, బీజేపీ యువనేత ఎన్ఆర్ఐ  బీపీ నాయక్ , ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి మరీదు పరశురాముడు, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు దంతేబోయిన సురేష్, ఆళ్ళపాడు గ్రామ అధ్యక్షుడు దోన్తేబోయిన వెంకట్రావు, ప్రచార కమిటీ కార్యదర్శి చెన్నకేసీ ఐతంరాజు, బాణోత్ బాలునాయక్ లు ఉన్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజా గొంతుక వినిపించే నాయకులను నిర్బంధించి ముందస్తు అరెస్టులు తో  ప్రభుత్వం వేధిస్తోంది ఇలాంటి చర్యలు కెసిఆర్ ప్రభుత్వానికి ఉరితాడై బిగుస్తుందని, రానున్న రోజుల్లో నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పటానికి సిద్దముగా ఉన్నారని వారు  అన్నారు.