స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలు

Published: Monday July 05, 2021
బాలాపూర్, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : భావితరాల వారికి స్వామి వివేకానంద సూక్తులు,సామెతలు ప్రసంగానికి  స్ఫూర్తి గా హిందుత్వాని ప్రపంచంలో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిని కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ తెలిపారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి నేతలతో పాటు కలిసి, బిజెపి అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... స్వామి వివేకానంద 1863 సంవత్సరంలో జూలై 4న జన్మించి, 1902 సం.. వరకు, ప్రపంచంలో భారతదేశ హిందుత్వాన్ని ముక్తకంఠంతో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కొనియాడారు. ఆయన సూక్తులు గానీ, సామెతలు గాని, భావితరాలవారికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దేశ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని ఆయన ఆశయాలు ముఖ్యంగా యువతకు ఎంతో ఆదర్శం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు. పసునూరి బిక్షపతి చారి. ముత్తంగి కరుణానిధి. మీర్ పేట్ బిజెపి ప్రధాన కార్యదర్శి కోడూరు సోమేశ్వర్. ఓ బి సి అధ్యక్షుడు తుమ్మల రమేష్. ఉపాధ్యక్షులు గోపీనాథ్ చారి. శ్యామ్ సుందర్. సత్తయ్య. పాండు మల్లికార్జున్. బిజెపి  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.