బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం

Published: Saturday October 29, 2022
6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజాపాలన : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని వికారాబాద్ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్ అన్నారు. శుక్రవారం చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని జడ్పిహెచ్ఎస్ వెంకటపూర్ తండా పాఠశాలలో  విద్యార్థులకు బాల్యవివాహాలు, బాలల రక్షణ, సంరక్షణ ,జెండర్,  ఫోక్సో యాక్ట్, చైల్డ్ లైన్ సర్వీస్ ల గురించి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... బడి బయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించడంతోపాటు ,వారికి తరగతికి తగ్గ బోధన జరగాలని కోరారు. బాలలను లైంగిక వేధింపులకు గురి చేయకుండా వారికి రక్షణ, సంరక్షణ అందించవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. బాలలకు ఎలాంటి సమస్యలు ఉన్న 1098 కు ఫోన్ చేయాలని కోరారు.  అనంతరం బాలలకు స్కూల్ యూనిఫారలు అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో  ఎస్ఎంసి చైర్మన్ రాజు నాయక్, ప్రధానోపాధ్యాయులు వీర కాంతం, చైల్డ్ లైన్ కౌన్సిలర్ రామేశ్వర్ ,టీమ్ మెంబర్ దేవ కుమారి, ఉపాధ్యాయులు , పిల్లలు పాల్గొన్నారు.