బత్తినేని ట్రస్ట్ సేవలు అభినందనీయం హెల్త్ కార్డును సద్వినియోగం చేసుకోవాలి

Published: Thursday December 29, 2022

బోనకల్, డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మేఘశ్రీహాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ చెక్ కప్ క్యాంపును బుధవారం నిర్వహించారు. ఈ క్యాంపులో 150 మందికి రక్తపరీక్షలు, ఈసిజీ, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ భీజాన్బీ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా మండల కేంద్రమైన బోనకల్లో బిపీ, షుగర్, కంటి ప్రత్యేక క్యాంపును బత్తినేని ట్రస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్ముందు గ్రామీణ ప్రజలకు మరిన్ని వైద్యసేవలు అందించాలని ఆకాంక్షించారు. మేఘ శ్రీహాస్పిటల్ సేవలను మండల ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. మేఘ శ్రీహాస్పిటల్ ప్రముఖ వైద్యులు టి పవనకుమార్ మాట్లాడుతూ.. మేఘ శ్రీ హాస్పిటల్ రూపొందించిన రూ.499 హెల్త్ కార్డును ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్డు పొందిన వారు మొదట విడత రూ. 3 వేలు విలువ చేసే పరీక్షలు ఉచితంగా చేయబడుతుందని తెలిపారు. డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ ఇన్విస్టిగేషన్, ఎమర్జెన్సీ, సర్జికల్, హెల్త్ ప్యాకేజ్లలో రాయితీలు కల్పించబడుతుందన్నారు. ఈ సదవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు షేక్ హుసేన్ సాహేబ్, సిపిఎం నాయకులు కందికొండ శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు జక్కా నాగభూషణం, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, క్యాంపు నిర్వాహాకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాథ్, నిఖిల్, సిబ్బంది యంగల గిరి, పండగ గోపి, ఇవాంజిలిన్ తదితరులు పాల్గొన్నారు.