అన్నదానాన్ని ప్రారంభించిన సర్పంచ్ మారెళ్ళ మమత..

Published: Saturday October 29, 2022
తల్లాడ, అక్టోబర్ 28(ప్రజాపాలన న్యూస్): 
 *ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత శుక్రవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన పొంగులేటి వీరాభిమానులు షేక్. యాకూబ్ పాషా, రాగం నాగరాజు దాతల సహకారంతో కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పొంగులేటి రెండు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులని, ఆయన జన్మదిన వేడుకలు వాడవాడల జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, మాజీ ఎంపీటీసీలు తుమ్మలపల్లి సత్యవతి, తాళ్ల జోసెఫ్,  టిఆర్ఎస్ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి రమేష్,  పొన్నం కృష్ణయ్య, లక్ష్మారెడ్డి, కేశవరెడ్డి, మారెళ్ళ మల్లికార్జునరావు, గోవిందు నరసింహారావు, పులి వెంకట నరసయ్య, షేక్ యాకుబ్ పాషా, యం డి బాబు, షేక్. మైమూద్ పాషా, చింతల నరేష్ పాల్గొన్నారు.*