సింగరేణి పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

Published: Friday May 20, 2022
శ్రీరాంపూర్ జీ ఎం సంజీవరెడ్డి
 
నస్పూర్, మే 19, ప్రజాపాలన ప్రతినిధి: సింగరేణి పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచి సింగరేణి సంస్థకు, సింగరేణి ఉన్నత పాఠశాలలకు పేరు  తీసుకు రావాలని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవరెడ్డి అన్నారు. గురువారం సీసీసీ సింగరేణి ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జీఎం చేతులమీదుగా హాల్ టికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి పాఠశాలలో ఈ సంవత్సరం పదో తరగతి పరీక్ష రాస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. విద్యార్థులందరూ పదవతరగతిలో 10/10 రావడానికి ప్రయత్నించాలని కోరారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడం వలన సింగరేణి సంస్థ,  సింగరేణి ఉన్నత పాఠశాలకు పేరు తెచ్చిన వారవుతారని అన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పదోతరగతి తొలిమెట్టు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, డీజీఎం పర్సనల్ పి.గోవింద రాజు , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస రావు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.