*వికలాంగులకు పెన్షన్ 10వేలకు పెంపు, ఉచిత విద్యుత్ సాధన కోసం రాష్ట్ర వ్యాపిత ఉద్యమం* *యక్సేస్బల

Published: Saturday October 08, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి

వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంపు,  ఉచిత విద్యుత్ సాధన, 2017మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ అమలు  కోసం రాష్ట్ర వ్యాపితగా  ఉద్యమాలు చేస్తామని ఎంపీఆర్టి జిల్లా కార్యదర్శి జేర్కోని రాజు హెచ్చరించారు*
ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో కట్టేల వేంకటేశ్ అధ్యక్షతన ఈ రోజు జరిగింది   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ* 2015 లో సామూహిక ప్రాంతాలన్నీ అవరోధారహితంగా మర్చుతమని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసిందని అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారని వీరిలో కేవలం 4.83 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ 10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి ముగిసిన వికలాంగులకు సర్టిఫికేట్ పొందినప్పటి నుండి ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం వికలాంగులకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.వికలాంగులకు ఉచిత విద్యుత్ పథకం సాధన కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గడిచిన 8ఎండ్ల కాలంలో 12లక్షల ఆసరా పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినారు. తక్షణమే ప్రభుత్వం రద్దు చేసిన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.2017మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానసిక ఆరోగ్య అథారిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో వికలాంగులకు వేధింపులకు గురవుతున్నారు. శారీరక వైకల్యం పేరుతో వికలాంగులను ఎత్తి పొడుస్తున్నారు  రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ప్రతి వికలాంగులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. త్రీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవేన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు.WHO లెక్కల ప్రకారం 10-20శాతం మంది వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాపితంగా 15.5కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారనీ ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించిందనీ అన్నారు. ప్రతి నిమిషానికి 11మంది ఆకలితో మరణిస్తున్నారనీ తెలిపారు. పౌష్ఠిక ఆహారలోపం ప్రజలందరికీ అందించడంలో పాలకులు విఫలం చెందినరని విమర్శించారు. వికలాంగులలో 9 శాతం మంది మాత్రమే మాధ్యమిక విద్యా పూర్తి చేస్తున్నారు. 40శాతం లోపు స్కూల్ లలో మాత్రమే ర్యాంపులు ఉన్నాయని అన్నారు.17శాతం పాఠశాలల్లో వికలాంగులు వినియోగించుకునే విధంగా టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. వికలాంగుల పిల్లలకు విద్యా ప్రత్యామ్నాయాలపై పాలకులకు చిత్తశుద్ది లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వికలాంగులను విద్యకు దూరం చేసే విధంగా ఉందని అన్నారు. వినికిడి లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో వినికిడి పరీక్షలు నిర్వహించాలని ఆయన అన్నారు. మిషన్ వాత్సల్య పేరుతో బాలబాలికల సంరక్షణ పథకాలను కేంద్ర ప్రభుత్వం విలీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నదాని విమర్శించారు ప్రభుత్వ నిర్ణయం మహిళలు, వికలాంగులు, బాలబాలికల సంరక్షణ ప్రమాదంలో పడుతుందని అన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల స్టడీ సర్కిల్ ఎర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్ ఎర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు.21రకాల వైకల్యాల వారికి వైకల్య ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 6ఎండ్లు అవుతుందని అమలులో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. చట్టాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం వల్ల వికలాంగులు రిజర్వేషన్స్ దక్కకుండా పోతాయని అన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.40శాతం వైకల్యం కలిగిన వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులని 2016 RPD చట్టం చెపుతుంటే రాష్ర్టంలో ఆర్టీసీ అధికారులు మాత్రం బదిరులు, మానసిక వికలాంగులు, అంధులకు 100శాతం వైకల్యం ఉంటేనే రాయితీ బస్ పాస్లు ఇస్తామని అధికారులు చెప్పడం సరైంది కాదన్నారు. షరతులు లేకుండా వికలాంగులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో రైల్వే ఆన్లైన్ పాసుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్షం చేస్తున్నారని అన్నారు పేదలపై బరాలు వేస్తు సంపన్నులకు రాయితీలు ఇస్తున్నారని అన్నారు.వికలాంగులను అవమానపరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు జీవో వచ్చిన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.                      అనంతరం నూతన గ్రామ కమిటీ ఎనుకోవడం జరిగింది గ్రామ  ఎంపీ ఆర్డీ అధ్యక్షులు బోడ్డు వెంకట్ రెడ్డి ప్రదాన కార్యదర్శి కావలి ఎల్లయ్య ఉపాధ్యక్షులు పుల పాపయ్య ప్రచార కార్యదర్శి పుల శివాని సహయ్య కార్యదర్శి పద్మ కోశాదికారి  వెంకటేష్ కమిటీ సభ్యులుగా రవి ఉమాదేవి బాల్ రాజ్ ప్రతాప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.