పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని యూత్ కాంగ్రెస్ మరియు పట్టణ మండల కాంగ్రెస్ కమిటీ ల ఆ

Published: Wednesday June 09, 2021
మధిర, జూన్ 8, ప్రజాపాలన ప్రతినిధిగా : మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర మైన పెట్రోల్ ,డీజిల్ ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి వారి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్న విధానాన్ని నిరసిస్తూ మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ అద్వర్యం లో నిరసన ధర్నాను చెప్పట్టారుఈ సందర్భంగా మండల కాంగ్రెస్స్ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ మాట్లాడుతూ పెట్రోల్ 100 కు పైన డీజిల్ 100 కు చేరువగా పెరిగిందని దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా రైతులు  తీవ్రంగా నస్ట పోతున్నారు అని ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని కార్పొరేట్ అనుకూల నిర్ణయలు తీసుకొని ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారు అని విమర్శించారుఈ కార్యక్రమానికి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పాల్గొని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మోడీ  నియంతృత్వ పరిపాలన ఇంకా కొనసాగించమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దారా బాలరాజు కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వర్లు జింకల కోటేశ్వరరావు గాంధీ పదం అధ్యక్షులు బోడేపూడి గోపి సైదల్లిపురం సర్పంచ్ పులి బండ్ల  చిట్టి బాబు ఆవుల కిరణ్ యూత్ నాయకులు బెజ్జం శ్రీకాంత్ దేవరకొండ రాజీవ్ గాంధీ మాగంటి చంటి బంటీ సిద్దు మైలవరపు చక్రి జహింగీర్ తదితరులు పాల్గొన్నారు