మావోయిస్ట్ సానుభూతి పరుల అరెస్ట్ ...అందులో ముగ్గురు కొరియర్లు కాగ ముగ్గురు దళంలో చేరేందుకు

Published: Monday June 13, 2022
జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ 
 
ఆసిఫాబాద్ జిల్లా,  జూన్ 12 , ప్రజాపాలన, ప్రతినిధి  : 
 
కేబీ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పరిధిలోని బెజ్జూర్ మండలం కుష్ణ పెళ్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీలో ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులు పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ తెలిపారు. ఆదివారం కాగజ్ నగర్ టౌన్ (బి) పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్  మాట్లాడుతూ బెజ్జూర్ మండలం కుశ్న పల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీలో ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులు పట్టుబడ్డాడని, అందులో ముగ్గురు కొరియర్లు, ముగ్గురు దళంలో చేరేందుకు వెళ్తున్నారని అన్నారు. వారి వద్ద నుండి 53 డిటోనేటర్లు, 27 జీలెటిన్ స్టిక్స్, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ మావోయిస్టు లలో  బెజ్జూర్ మండలం మురళిగుడా కు చెందిన మాడే హనుమంతు కు 1987నుండి,మావోయిస్టులతో సంబంధాలున్నాయని, అతని ఇంటికి మావోయిస్టులు వచ్చి వెళ్తారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని గుర్తించి దళంలో చేరేట్టు ప్రోత్సహించాలని మావోయిస్టులు సూచించినట్టు తెల్సిందని, కొత్తగా ముగ్గురిని దళంలోకి చేర్చేందుకు ఆదివారం బయలుదేరి వెళ్తుండగా  బెజ్జూర్ సిఐ బుద్దె స్వామి, ఎస్సై వెంకటేశ్వర్లు, వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దేస్వామి, బెజ్జూర్ ఎస్సై వెంకటేశ్వర్లును అభినందించారు. ప్రెస్ మీట్ లో స్థానిక సీఐ రవీందర్, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, రాజ్యలక్ష్మి, దహెగాం ఎస్ఐ సనత్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.