పి డి ఎస్ యూ, రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయండి . రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రాజేష్*

Published: Wednesday November 16, 2022

చేవెళ్ల నవంబర్ 15 (ప్రజాపాలన):-

ప్రగతిశిల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యూ  తెలంగాణ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మహాసభల పోస్టర్లను రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రాజేష్, చేవెళ్ల డివిజన్ నాయకులతో కలిసి రిలీజ్ చేయడం జరిగింది.
    పి డి ఎస్ యు  తెలంగాణ రాష్ట్ర 22వ మహాసభలు డిసెంబర్ 1,2,3, న నిజామాబాద్ లో జరగనున్నాయి.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలనుండి విద్యార్థుల నాణ్యమైన హక్కుల డిమాండ్ సాధన కోసం విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని అందరికి ఉచిత నాణ్యమైన శాస్త్రియమైన విద్యాకావాలని కామన్ విద్యావిధానం కోసం పోరాడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో పురుడుపోసుకున్నటువంటి
పి డి ఎస్ యూ,  దేశంలో రాష్ట్రంలో విద్యారంగా అభివృద్ధి కోసం పోరాడుతూ సమాజ మార్పు కోసం నిరంతరం పరితపిస్తుంది. రోజురోజుకు విద్యా విధానం సంతలో సరుకులాగా మార్పు చెందుతూ కార్పొరేట్ కబంధహాస్తాల్లో కురుకుపోతున్నాటువంటి పరిస్థితి ఉంది. పేదవాళ్ళు చదువుకున్నటువంటి ప్రభుత్వ రంగ విద్యాసంస్థలను ప్రభుత్వం పట్టించుకోవడంలో విఫలం అవుతుంది. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉచిత నిర్భంద విద్యాహక్కులను ప్రభుత్వమే ఉచితంగా అందించాలని అందుకోసం భవిష్యత్తులో పి డి ఎస్ యూ  నిర్వహించే పోరాటాలకు ఈ మహాసభ వేదిక కానుంది కాబట్టి విద్యార్థులు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు   చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు కొజ్జెంకి జైపాల్, కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్, సురేష్, అశోక్ లు ఉన్నారు.