తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరిక. నాటుసారాయితో పట్టుబడితే శిక్షలు మరింత కటినం సిఐ సర్వేశ్ .

Published: Monday December 12, 2022

బూర్గంపాడు (ప్రజా పాలన.)
నాటుసారా,కల్తిమధ్యం,గంజాయి,మాదక ద్రవ్యాలు తదితరములు వినియోగిస్తే 6 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట గోడలకు ఖమ్మం ఎక్స్చేంజ్  సీఐ సర్వేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరిక అనే వాల్ పోస్టర్లు అంటించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐ సర్వేష్ మాట్లాడుతూ నాటుసారా,కల్తిమధ్యం,గంజాయి,మాదక ద్రవ్యాలు తదితరములు వినియోగించిన,అమ్మినా, సరఫరా చేసిన ప్రభుత్వ ఆదేశాల మేరకు 6 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష విధంచడానికి నిర్ణయించడం జరిగింది అని తెలిపారు.ఎవరు పట్టుబడ్డ శిక్షలు కటినంగా ఉంటాయి అని మీ గ్రామాలలో ఇట్టి నిషేధిత అమ్మకాలు జరిగితే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతోంది అని తెలిపారు.ముఖ్యంగా జిల్లాలో బూర్గంపహడ్ మండల కేంద్రంలోనే హానికర గుడుంబా తయారీ జరుగుతుందని సమాచారం ఉందని,ఇప్పటికైన గుడుంబాను నిలిపివేయకపోతే శిక్షలు కటినంగా ఉంటాయి అని ప్రజలకు ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు వారి బృందం ఉన్నారు.