కరోనా టీకా పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దు

Published: Monday April 26, 2021
కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి 
మేడిపల్లి, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా టీకా పట్ల ప్రజలు ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని, టీకా నూటికి నూరు శాతం సురక్షితంతో పాటు క‌రోనా ఉద్రుతి నుండి ఖ‌చ్చితంగా బ‌య‌ట‌ప‌డేస్తుంద‌ని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి భ‌రోసానిచ్చారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి మేడిపల్లి ఐసోలేషన్ సెంటర్లో కరోనా వాక్సినేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కార్పొరేటర్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను కార్పొరేటర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి మొదటి డోస్ కరోనా టీకాను తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న స‌దుపాయాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీకా స‌ర‌ఫ‌రాల‌పై అధికారుల‌తో చ‌ర్చించి నిరంత‌రం టీకా అందుభాటులో ఉంచేలా ఆదేశాలిచ్చారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా టీకా తీసుకున్న‌ప్ప‌టికీ మాస్కులు, బౌతిక‌ధూరం పాటించిన‌ప్పుడే పూర్తిగా క‌రోనా నుండి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని తెలిపారు. క‌రోనా అంద‌రికి ప్రాణాంత‌క‌మైన‌ది కాకున్నా కొంత‌మందిలో తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్న నేప‌థ్యంలో అలాంటి వారిని కాపాడుకోవ‌డానికి ప్ర‌తీ ఒక్క‌రూ భాద్య‌త‌గా వ్యవహరించాలనిి సూచించారు.