ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి .**చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజల సమస్య

Published: Tuesday March 07, 2023
***బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు
 ప్రశాంత్ కుమార్ రెడ్డి***

 ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 43వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు  ప్రశాంత్ కుమార్ రెడ్డి  తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామంలో గడపగడపకు తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మేల్యే  ఆధ్వర్యలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను వివరిస్తూ. ప్రజలకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోహెడ గ్రామ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి బంటి  మాట్లాడుతూ. ప్రగతి నివేదన యాత్ర జనవరి 22న నందివనపర్తి గ్రామంలో ఆనందీశ్వరుని ఆశీస్సులు తీసుకొని ప్రారంభమై. నేటివరకు 2 మున్సిపాలిటీలు, 3మండలాలు 43రోజులు 75 గ్రామాలు, 575కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ కోహెడ గ్రామానికి వచ్చాను.
ఎమ్మేల్యే నాకు ఒకటే విషయం చెప్పారు. గత 3 ఎన్నికల్లో ప్రజలు మనకు ఓట్లేసి నన్ను ఎమ్మేల్యేగా గెలిపించి, ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని, నాదృష్టికి తీసుకువస్తే నేను వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ప్రగతి నివేదన యాత్రగా మీకో హెడకు రావటం జరిగింది.ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, మేము ఓటు అడగడానికి రాలేదు. గత సంవత్సరాల నుంచి తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామంలో ఉన్న 2,4,5 వార్డులలో ముఖ్యమంత్రి  కేసీఆర్  నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని బంటి  అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని నిధులు వచ్చేవి కావు ఒకగ్రామంలో బీటీ రోడ్డు కాదు మట్టి రోడ్డు వేయడానికి కూడా 2లక్షల రూపాయల శాంక్షన్ ఇవ్వాలంటే ఎన్నో నెలలు పట్టేది ఎంతో కష్టంగా ఉండేది. అలాంటిది కేసీఆర్  ముఖ్యమంత్రి అయిన
తర్వాత ఎమ్మేల్యే  ఆధ్వర్యంలో.ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు సీసీ రోడ్లు  డ్రైనేజీ ఇతర అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం.
పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా ఉండేది, వారి గుండెల మీద కుంపటి ఉన్నట్టుండేది. గతంలో ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు మేనమామ కొంత ఆర్థిక సహయం చేసేవారు కానీ ఇప్పుడు చేస్తున్నారా ఇవ్వడం లేదు కాబట్టే గొప్ప మనస్సున్న మన సీఎం కేసీఆర్ ఆలోచన చేసి ఆడబిడ్డ పెళ్లి చేస్తే తల్లి పేరుమీద 1,00,116 రూపాయల చెక్ ఇచ్చి మేనమామగా ఆదుకుంటున్నారు.
అదేవిధంగా గర్బిణీలు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయిన తర్వాత అమ్మ ఒడి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే 13వేలు, మగబిడ్డ పుడితే 12వేల రూపాలయలు సీఎం కేసీఆర్  ఇస్తున్నారు. వీటికి తోడు చంటిపాపకు కేసీఆర్ కిట్ ఇస్తారు. వాటిలో సబ్బులు, పౌడర్, అయిల్, క్రీమ్, టవల్ ఇతర వస్తువులు ఉంటాయని బంటి  అన్నారు.కోహెడ గ్రామంలో ఉన్న 4వ వార్డులో కౌన్సిలర్ జ్యోతి గారు పెద్దయెత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారు. కానీ 2,5వార్డులలో పరిస్థితులు బాగాలేవు. వాటన్నింటిని మార్చాల్సిన అవసరం ఉందని ఆరెండు వార్డులలో అభివృద్ధి పనులు జరగకుండా కొందరు అడ్డుకుంటున్నారు వాళ్లు ఎవరనేది మీకు బాగా తెలుసు. రాబోయే రోజుల్లో ఆవార్డుల్లో మార్పు జరగాలని, కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలని బంటి  అన్నారు.
ప్రగతి నివేదన యాత్రలో బీఆర్ఎస్ పార్టీ తుర్కయాంజల్ మున్సిపల్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మా రెడ్డి, మున్సిపల్ ప్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, 4వ వార్డు కౌన్సిలర్ జ్యోతి జంగయ్య, మహిళ ఆధ్యక్షురాలు అశ్విని, 2,4,5వ వార్డుల అధ్యక్షురాలు యాదమ్మ, శోభ, సునీత, మాజీ సర్పంచ్ బిందు రంగారెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్ బల్దేవ్ రెడ్డి, మైలారం రవీందర్, తిరుమల్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మచారి, లక్ష్మమ్మ నర్సింహ్మ, విజయాబ్బాబు, ఆంజనేయులు, శ్రీనివాస్ కురుమ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,  బీవైఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.