గ్రామాలలో పాత ఇనుప స్థంభాలను తొలగించాలి

Published: Friday February 05, 2021
 గ్రామాంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు
 పల్లె పల్లెకు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : గ్రామాలలో పాత ఇనుప స్థంభాలను తొలగించి కొత్త సిమెంట్ స్థంభాలను ఏర్పాటు చేయాలని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచించారు. గురువారం పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి యాలాల మండలం చెన్నారం, అక్కంపల్లి, బండిమీదిపల్లి, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ సెక్రెటరీలు, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారుల ఫోన్ నంబర్లతో పంచాయతీ కార్యాలయంలో బోర్డును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆయా గ్రామాలలో పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిరుపేదల కోసం చెన్నారం గ్రామంలో కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అక్కంపల్లి, బండిమీదిపల్లి గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాలు, శిథిలావస్థకు చేరిన పాత ఇళ్లను వెంటనే కూల్చి వేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, ఎంపీపీ వైస్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, రమేష్, కో ఆప్షన్ సభ్యుడు అక్బర్ బాబా, నాయకులు మాధవ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, చిట్టి పటేల్, నర్సిరెడ్డి, విజయ్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ రెడ్డి, రఘురెడ్డి, కృష్ణ, సర్పంచులు సాయిలు, నారాయణ, రాంచంద్రమ్మ, అమర్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు ఆశన్న, సప్తగిరి గౌడ్ తదితరులు ఉన్నారు.
Attachments are