ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 29 ప్రజా పాలన ప్రతినిధి ***బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ

Published: Thursday March 30, 2023

     తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన పేపర్ లీకేజ్ వ్యవహారం జరిగి నిరుద్యోగ అభ్యర్థులు మోసపోతున్నందున ఈ విషయాన్ని గుర్తించిన ప్రజా నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష  17 మార్చి 2023  నాడు  పోరాటం చేసినందున  గ్రూప్ -1 పరీక్షతో  సహా ఇతర పరీక్షలను రద్దు చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన వారికి న్యాయం జరుగుటకు అండగా నిలబడ్డ విషయం మనందరికీ తెలిసినదే, ఈ వ్యవహారంలో వాస్తవంగా కష్టపడిన నిరుద్యోగులు నష్టపోతుంటే , మోసపూరితంగా డబ్బులు ఇచ్చి పేపర్ లీకేజీ ద్వారా పరీక్షలు రాసిన అభ్యర్థులు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి,  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క స్వతంత్రత,
సర్వీస్ కమిషన్ యొక్క పేరు ప్రతిష్టలు, కొందరి మూర్ఖుల మోసపూరిత విధానాల వల్ల దెబ్బతినే  ప్రమాదం ఉన్నందున,గత ఆరు నెలల నుండి  టీఎస్పీ పిఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన 12 రకాల పరీక్షలన్నిటిని రద్దుచేసి, మరల ఫ్రెష్ గా రద్దు చేసిన తదితర ఆ  పరీక్షలన్నీ ఉద్యోగ అభ్యర్థుల నుండి ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా ఆ యొక్క పోటీ పరీక్షలు  నిర్వహించి, 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రకరకాల కష్టాలు పడుతూ చదువుకుంటున్నారు. అందులో ముఖ్యంగా పేదరికంలో తల్లిదండ్రులు పంపే కూలి డబ్బులతో మరియు అప్పులు చేసి కొందరు, ఉన్న అర ఎకరం, ఎకరం భూమిని అమ్మి మరికొందరు భార్య దగ్గర ఉన్న బంగారాలు తాకట్టు పెట్టి మరికొందరు  టీఎస్పీ పిఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లలో   చదువుకుంటున్న వారు కొందరైతే, పెళ్లి వయసు దాటిన కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేనందున ఉద్యోగమే వస్తే తప్ప వారి సొంత ఊరికి వెళ్లకుండా ఎంతోమంది నిరుద్యోగులు యూనివర్సిటీలలో  పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డొల్లతనం వల్ల చైర్మన్ మరియు సభ్యుల నిర్లక్ష్య వ్యవహారం వలన ఎందరో నిరుద్యోగుల భవిష్యత్తు అగోచర గమ్యంగా తయారయింది. అందుకు బాధ్యత వహిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యు లందర్ని పదవుల నుండి తొలగించి కొత్త కమిషన్ మరియు సభ్యులను నియమించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క  స్వతంత్రతను కాపాడి, 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహింపట్నం అసెంబ్లీ కమిటీ తరపున డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా ఈ వినతి పత్రం అందజేస్తున్నాం.

*బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్స్*

గత ఆరు నెలల నుండి  టీఎస్పీఎస్సీ  ఆధ్వర్యంలో నిర్వహించిన 12 రకాల పరీక్షలన్నిటిని రద్దు చేయాలని.*
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్  కమిషన్ యొక్క  ప్రస్తుత కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని మరియు కమిటీ  సభ్యులను తొలగించాలని.
రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న  సీట్ విచారణను నిలుపుదల చేసి,సిబిఐతో విచారణ చేయించాలని.
కొత్త చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించిన తర్వాత పరీక్ష తేదీలను ప్రకటించి,పోటీ పరీక్షలు నిర్వహించాలనీ డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో...జిల్లా మహిళా కన్వీనర్ *కంబాలపల్లి శాంత , అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి గోపగల్ల దాసు అసెంబ్లీ కోశాధికారి కొండ్రు రఘుపతి , మండల అధ్యక్షులు వంగాల కృష్ణ ప్రసాద్  తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు వద్దిగళ్ల బాబు  పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు యంజాల  ప్రహ్లాద్  తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మేతరి కుమార్ , కార్యదర్శి భూతం రమణ, కోశాధికారి పట్నం రమేష్ కురుమ  సెక్టార్ అధ్యక్షులు *ఎల్ రాజుగారు* తదితరులు పాల్గొన్నారు.