*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన* -కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలి. ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష

Published: Friday March 03, 2023

కార్పొరేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య పాఠశాలల కళాశాలల గుర్తింపు రద్దుచేయాలనీ ఎస్ ఎఫ్ ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్  శ్రీనివాస్అన్నారు.
చేవెళ్ల మండల కేంద్రం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోర్యాలీగా  నిరసన తెలియజేసారు.  
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న ఆంధ్ర పాలకుల చైతన్య నారాయణ విద్యాసంస్థలను మూసివేస్తామని ప్రగల్ బాలు పలికాడు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అనేక బ్రాంచ్లకు నారాయణ చైతన్య విస్తరించిందని ఫీజుల దోపిడీ ఎక్కువైందని విద్యార్థులను చదువు పేరుతో మానసిక ఒత్తిడి ఎక్కువైందని దాని కారణంగా చాలామంది విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని అన్నారు చనిపోయిన విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయమని, ఆ కళాశాలలపై కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను వెంటనే బంద్ చేయాలని గుర్తింపు రద్దు చేయాలనిఅన్నారు.లేనిపక్షంలో సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు ఏసు విగ్నేష్ సోను కవిత రమ్య శ్రావణి తదితరులు పాల్గొన్నారు.