ఫైరింగ్ లో బెస్ట్ మెడల్ పొందిన ఆలేరు ఎన్.సి. సి. విద్యార్థి

Published: Wednesday September 14, 2022
యాదాద్రి భువనగిరి  జిల్లా 13 సెప్టెంబర్ ప్రజాపాలన:
ఫైరింగ్ లో బెస్ట్ గా రాణించిన పేరపు మనోజ్ కుమార్. 
ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్.సి. సి. విద్యార్థి పేరపు మనోజ్ కుమార్ బెస్ట్ ఫైరర్  మెడల్ పొందారు. ఈనెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు వరంగల్ లోని పోలీస్ ట్రైనింగ్ కళాశాల లో, 10వ ఎన్.సి. సి. బెటాలియన్ ఆద్వర్యంలో జరుగుచున్న కంబైన్డ్ ఆన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ఈ మెడల్ ను అందుకున్నాడు. వెపన్ ట్రైనింగ్ మరియు ఫైరింగ్ శిక్షణ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మొదటి స్థానాన్ని పొందాడు. నాలుగవ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ డిప్యూటీ డైరెక్టర్ నారాయణరెడ్డి, వరంగల్ ఎన్.సి. సి. పదవ తెలంగాణ బెటాలియన్ నూతన కమాండింగ్ అధికారి కల్నల్  ఏ. ఎన్. ఖండూరి చేతులమీదుగా ఈ మెడల్ ను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో పోలీస్ శిక్షణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస్, వరంగల్ ఎన్.సి. సి. పదవ తెలంగాణ బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.కె.ఆర్‌. జగతప్,  క్యాంప్ అడ్జటెంట్ కెప్టెన్ పి.సతీష్ కుమార్, కెప్టెన్ సదానందం, ఆలేరు ఎన్.సి. సి. అధికారి దూడల వెంకటేష్ మరియు ఎన్.సి. సి. అధికారులు జితేందర్ కుమార్, జి. రాజయ్య, జె. ప్రవీణ్ కుమార్ ఆర్మీ అధికారులు సుబేదార్ మేజర్ సుహాస్ కదం, బి.హెచ్.ఎం. గౌస్, సందీప్ జాదవ్ సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, సుధామణి, సతీష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహిత పేరపు మనోజ్ కుమార్ ను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పురి ప్రముఖులు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.