గ్రామాల అభివృద్ధికి 2.60 కోట్లు నిధుల ప్రొసీడింగ్స్ జారీ

Published: Friday November 11, 2022
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 10 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి 2.60 కోట్ల నిధుల ప్రొసీడింగ్స్ వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులకు అందజేశామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.