మంత్రి తలసాని చిత్రపటానికి పాలాభిషేకం...

Published: Monday October 18, 2021
అమీర్ పేట్ జోన్(ప్రజాపాలన ప్రతినిధి) : కాసులు పెడితేకాని కార్పొరేట్ వైద్యం అందని ఈ రోజుల్లో పేదప్రజల కోసం అహర్నిశలు శ్రమించి వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో అమీర్ పేట్ డివిజన్ కు 50 పడకల ఆసుపత్రిని తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన నిత్య కృషీవలుడు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు మాజీ కార్పొరేటర్ శేషు కుమారి. ఈ సందర్భంగా మంత్రి చిత్రపటానికి ఆమె మరియు డివిజన్ తెరాస నేతలు, బస్తీ ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేషు కుమారి మాట్లాడుతూ 5 పడకల ఆసుపత్రి నుంచి 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కష్టపడ్డారని, ఎన్నో అవరోధాలు దాటి క్యాబినెట్ లోని పలు మంత్రులను తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి నిర్మాణ, ప్రారంభ పనులను వేగవంతం చేసి ఏడాదిన్నర నుంచి కరోనా ఇబ్బందుల వల్ల ప్రారంభం ఆగిన మళ్ళీ అధికారులతో మాట్లాడి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు, ఈ ఆసుపత్రి వలన అమీర్ పేట్ వాసులకే కాకుండా చుట్టూ పక్కన ఉన్న డివిజన్ లోని పేద ప్రజలకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని అన్నారు. అమీర్ పేట్ డివిజన్ లో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తూ, పేదల పాలిట పెన్నిధిగా మంత్రి నిలిచారని ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, అశోక్ యాదవ్, డివిజన్ అధ్యక్షడు హనుమంతరావు, సీనియర్ నేతలు సంతోష్, ప్రవీణ్ రెడ్డి, హరి సింగ్, లక్ష్మణ్, శేఖర్ గౌడ్, నరేష్, శివ, రాజు ముదిరాజ్, సంపత్, వనం శ్రీనివాస్, రమేష్ మోత్కుపల్లి, జ్ఞానేశ్వర్, కట్ట బలరాం, లక్ష్మి, రాణి మరియు పెద్ద ఎత్తున మహిళలు, బస్తీ ప్రతినిధులు పాల్గొన్నారు.