ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరికలు --ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Friday September 30, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): బీర్ పూర్ మండల కోల్వాయి గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై  మాజీ సర్పంచ్ మల్లేశం అధ్వర్యంలో టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ఆహ్వానించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని అన్నారు. బీర్ పూర్ మండలం లో 100 కోట్ల తో రోళ్ళ వాగు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి తాగు, సాగు నీరు ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది అని, 90 శాతం నిర్మాణం పూర్తి అయిందని అన్నారు. చెరువుల్లో పూడిక తీయటం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి అన్నారు. 24 గంటల కరెంట్, రైతు బందు, రైతు భీమా, ఎరువుల, విత్తనాల పంపిణీ, ధాన్యం సేకరణ ఇలా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కొలుముల రమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, గ్రామ శాక అధ్యక్షులు రమకిష్టు సతీష్, నాయకులు రమేష్, గుండా సురేష్, తదితరులు పాల్గొన్నారు.