కళాశాల మేళకు విశేష స్పందన

Published: Tuesday December 13, 2022

జన్నారం, డిసెంబర్ 12, ప్రజాపాలన: మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల్ ఐటిఐ అప్రెంటిస్ కళాశాల మేళకు విశేష స్పందన లభించిందని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా మండల కేంద్రంలో మాట్లాడుతూ ఈ ఐటిఐ కళాశాల మేళ్లకు మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, కరీంనగర్, తదితర జిల్లాల నుంచి వందలాదిగా నిరుద్యోగులు వచ్చారన్నారు. ఈ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో పిట్టర్, డ్రెస్, మేకింగ్, డిజిల్ మెకానిక్, కోప, తదితర ట్రేడర్లో ఇంటర్వ్యూలు నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ కళాశాల అధ్యాపకులు, నిరుద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.