ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Tuesday August 10, 2021
కోరుట్ల, ఆగష్టు 09 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా సోమవారం రోజున తొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసిన సందర్భంగా కోరుట్ల పట్టణ కేంద్రంలో చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసి, మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆకుల రంజిత్ మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులకు మేలు చేసే విధంగా కిసాన్ సమ్మాన్ నిధి 9 వ విడత భారతదేశంలో దాదాపు పది కోట్ల మంది రైతులకు, పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఓకే సారి రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఈ పథకం ద్వారా రైతులకు అందజేయపడతయని గతంలో 8వ విడత నిధులు విడుదల సందర్భంగా పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జగిత్యాలకు వచ్చి రైతులకు నిధులు విడుదల చేసే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రసంగాన్ని రైతులకు వినిపించి కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం రోజున కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తొమ్మిదో విడత కార్యక్రమం ద్వారా నేరుగా రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో రైతులకు ఐటీ ఉంటే మరియు ఉద్యోగస్తులకు, బడా భూస్వాములకు ఈ పథకం వర్తించదు, జగిత్యాల జిల్లాలో దాదాపు లక్ష మంది రైతులకు 20 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరింది .ఇంత చక్కటి పథకాన్ని తీసుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల రంజిత్ జిల్లా కొ కన్వీనర్ ఇందూరి సత్యం బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు పోతుగంటి శ్రీనివాస్, గిన్నెల శ్రీకాంత్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మడవేని నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెలుమూరి రాజమురళి, బీజెయైమ్ అధ్యక్షులు ఠాగూర్ ప్రవీణ్ సింగ్, ప్రధాన కార్యాదర్శి చిటిపెల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఉరుమాండ్ల నరేష్, దళిత మోర్చా అధ్యక్షులు సదుల వెంకటస్వామి కాశీరం, గుద్దేటి శ్రీనివాస్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.