ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 3 ప్రజా పాలన ప్రతినిధి ***ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో అభివృద్ధి పథంల

Published: Saturday March 04, 2023

ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ ఆయన ఫాక్స్ కాన్ ఇబ్రహీంపట్నం రావడంతో ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని శేరిగుడాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, నీటిపారుదల,సంక్షేమవైపు అడుగులు వేస్తూ తెలంగాణ అభివృద్ధి ఏకైక నాయకుడు, ప్రపంచ పటంలోని తెలంగాణను వెలుగెత్తి చూపేలా చేసిన విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణను ఐటీ హబ్ గా మార్చిన కీర్తి మంత్రి కేటీఆర్కు దక్కుతుందన్నారు.ఈ అంతర్జాతీయ స్థాయి కంపెనీతో నియోజకవర్గంలో పదవ తరగతి చదువుతున్న డిగ్రీ చదివిన వారికి   నిరుద్యోగం తొలగిపోతుందన్నారు. మంచాల మండలం తాళ్లగూడ గ్రామంలో 400 ఎకరాలు కొంగర కాలన్ లో 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పాక్స్ కాన్ రెండు లక్షల నుండి 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.  అంతర్జాతీయ స్థాయిలో అతి పెద్ద ఎలక్ట్రికల్ వస్తువులు పరికరాలు తయారు చేయు కంపెనీయని, ముఖ్యంగా స్థానిక మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని, ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అనేక కంపెనీలు టిసిఎస్  టాటా కంపెనీలు ఎరోస్ప్రెస్ లాంటి కంపెనీలు తెచ్చి నిరుద్యోగ భృతి కల్పించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
లో చెందనవేల్లి,శ్రీరాంపూర్ ఇంకా  వరంగల్లో కూడా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు  తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా సీఎం కేసీఆర్,కేటీఆర్ మార్చారన్నారు.తము ఎప్పుడు స్థానిక ప్రజలకు న్యాయం జరిగే విదంగా చూస్తామని, ఈ కంపెనీ పక్కనే ఫ్యాబ్ సిటీ ఉండడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గంలో పండుగ వాతావరణం వచ్చిందని తము నిజంగా సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. తమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు అల్వాల్ వెంకట్ రెడ్డి  మడుపు వేణుగోపాలరావు . వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ క్యామ శంకరయ్య.  కర్నాటి రమేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి.  బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.