కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్

Published: Wednesday August 04, 2021
తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ పిఅంజయ్య
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 3 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండలం ధర్మన్నగూడ కుర్మిద్ద గ్రామ సర్పంచులు మండల భాషయ్య బందే రాజశేఖర్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సీఐటీయూ రైతు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ పి అంజయ్య మాట్లాడుతూ 7 దశాబ్దాల స్వాతంత్ర్య అనంతరం కుడా తమ శ్రమతో సృష్టిస్తున్న కార్మికులు రైతులు ఇతర శ్రమ జీవులకు కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక  సరళీకరణ విధానాలు దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలు నిరుద్యోగం అసమానతలు  పేదరికం ఉపాధికోసం వలసలు పౌష్టికాహారంలోపం ఆకలిచావులు ఆత్మహత్యలు నేడు దేశాన్ని చుట్టుముట్టి దేశాన్ని సంక్షోభంలో పడేశాయి. గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి తో ప్రజానీకం విలవిల లాడుతున్న పేదలను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధపడలేదు. పార్లమెంట్ లో తమకున్న మెజార్టీతో రైతు వ్యతిరేక చట్టాలను  కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను తెచ్చింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పూనుకున్నది మనదేశంలో 1942 ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత కమిటీలు పిలుపు నిచ్చాయి. దీనిలో భాగంగా జులై 25 నుండి ఆగస్టు 9వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తున్నాం 9న పెద్దఎత్తున ప్రజలు నిరసన కార్యక్రమంలో పాల్గొని జయ ప్రదం చేయాలనీ గౌరవ సర్పంచులు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు రైతు సంఘం నాయకులు ఏం శ్రీమన్నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములు, సిఐటియు నాయకులు పి  సత్యనారాయణ, రైతు సంఘ నాయకులు జె హన్మంతు, యం యాదయ్య, ఎన్ సత్తయ్య, పి పౌలు, వెంకటేష్ . శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు.