కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ సేవలకు గుర్తింపు

Published: Tuesday September 07, 2021
రాoచంద్రాపురం, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు, పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి  కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి ఆదివారం రోజు చిదంబరం నటరాజ కళా నిలయం రజతోత్సవ వేడుకలు తెలంగాణ సారస్వత పరిషత్ అబిడ్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తిస్తూ కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి కి కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తి అందిస్తుందని ఫౌండేషన్ పై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామని అన్నారు. సేవలో వుండే సంతృప్తి మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతుందని, తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు వుంటాయన్నారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి చారి నాట్య గురువు ఫౌండర్ చిదంబరం, సెక్రెటరీ మంజులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.