శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Thursday January 27, 2022
మధిర జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు శ్రీ ఆర్య వైశ్య కళ్యాణ మండపం లో 73 వ గణతంత్ర వేడుకలను శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడు కురువెళ్ళ కృష్ణ కళ్యాణ మండపంలో జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడైన కురువెళ్ళ కృష్ణ మాట్లాడుతూ 1947 ఆగస్టు నుండి మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలను మన పూజ్య బాపూజీ నాయకత్వంలో అనేకమంది దేశ నాయకులు మరియు ప్రజలు 1857 బ్రిటిష్ పాలన పై జరిగిన సుదీర్ఘ పోరాటం మరియు అందరికీ సమాన హక్కులు అవకాశాలతో తయారుచేసిన మన రాజ్యాంగ ప్రతిని జనవరి 26న ఆమోదించడం జరిగింది ఆ రోజు నుండి రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడు అందరికీ నివాళులర్పించి ఎల్లవేళలా మన దేశాన్ని కాపాడుతున్న సైనికులును అభినందిస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ నేడు 73వ గణతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలోశ్రీ వాసవి కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి నాళ్ల శ్రీనివాస రావు,, ఇరుకుల్ల నరసింహారావు, చారు గుండ్ల నరసింహ మూర్తి, ఇరుకుల్ల రాధాకృష్ణమూర్తి, నంబూరు మురళి, పుల్ల కాండం చంద్రశేఖర్, గుండెల ముత్తయ్య, కుంచం కృష్ణారావు, మిరియాల రమణ గుప్తా, చేడే రామకోటేశ్వరరావు, దాచేపల్లి రాము, మాధవవరపు రమేష్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు