మున్సిపాలిటీ పరిధిలోపారిశుధ్యంపై 16వ వార్డు స్పెషల్ డ్రైవ్*

Published: Wednesday November 23, 2022
మధిర నవంబర్ 21 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో రోజుకు ఒక వార్డులో పారిశుధ్యం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయాకర్, కమీషనర్ అంబటి రమాదేవి తెలిపారు. దీనిలో భాగముగా మంగళవారం నాడు 16వ వార్డులో పర్యటించి పారిశుధ్యం, తడి చెత్త, పొడి చెత్త, వీధి దీపాలు, మంచినీటి సరఫరా తదితర విభాగాల పని తీరుపై వార్డు లోని ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త-పొడి చెత్త వేరు చేయుటపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ వీరమాచినేని నాగసులోచన, మున్సిపల్ మేనేజర్ రవీందర్, వార్డ్ ఇంచార్జ్ లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.