*ఉపాధి హామీ పథకం డైరెక్టర్ వీరేంద్ర శర్మ ని కలిసి వినతిపత్రం అందజేశారు* *ఉపాధిహామీ కూలీల సమస్

Published: Saturday July 16, 2022
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  కేంద్ర బృందానికి వినతి పత్రం జాతీయ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ వీరేంద్ర శర్మ కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చేతల్ల.జంగయ్య  మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న బిల్లులు 3నెలలుగా రావడం లేదన్నారు. ఉపాధి కూలీల డబ్బులు పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీ డబ్బులు వెంటనే చెల్లించి, పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు సరైన సదుపాయాలు కల్పించాలన్నారు. సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని ఉపాధి కూలీలు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఇవ్వాలని పార గడ్డపార డబ్బులు ఇవ్వాలని ఉపాధి కూలీలకు రోజువారి వేతనం 600 పెంచాలన్నారు. ఉపాధి పని రోజులు 200 రోజులకు పెంచాలని   ప్రభుత్వంని డిమాండ్ చేశారు... ఈ ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకటేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చీమల ముసిలయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్, జిల్లా నాయకులు శ్రీనివాస్, నాయకులు యాదగిరి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షులు బాలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.