ఏడో డివిజన్ లో హరితహారం కార్యక్రమం

Published: Friday July 09, 2021
బాలాపూర్, జులై 08, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణ ప్రగతి భాగంలో హరితహారాన్ని పలు ప్రదేశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, ఏడో డివిజన్ లో మొక్కలు నాటారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6వ, 7వ కార్పొరేటర్ల లతోపాటు కలిసి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు గురువారం నాడు స్వామి నారాయణ కాలనీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతూ.... పచ్చని చెట్ల, పచ్చదనం, పరిశుభ్రత పరిరక్షణ వల్ల కాలనీవాసులు అందరికీ ఆరోగ్యంగా ఉంటారని కార్పొరేషన్ మేయర్ అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.... మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత కాలనీ వాసులతో పాటు స్థానిక కార్పొరేటర్ పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోమ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీ ఇ అశోక్ రెడ్డి, ఏఈ లు మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి, దడిగ శంకర్, కాలనీవాసులు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు మహిళామణులు తదితరులు పాల్గొన్నారు.