ఎంపీ సోనియా గాంధీపై అక్రమ ఈ డి కేసుకి నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దగ్దం

Published: Saturday July 23, 2022

కోరుట్ల, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణములో పట్టణ మరియు మండల కాంగ్రెస్ అధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని  కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీని ఈ డి పేరుతో  నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వం సోనియాగాంధి రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష పూరితంగా ఇబ్బందులకు గురి చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలనుకుంటున్న మోడీ  చర్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసి, ధర్నా రాస్తారోకో  చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు తెగనమ్ముతు, రైతులను చిన్న చితక వ్యాపారులను నట్టేట ముంచుతూ, అధిక పన్నులతో పేద, సామాన్య మధ్య తరగతి ప్రజల రక్తాన్ని త్రాగుతూ, మరో వైపు తన అసమర్థత తో నిరుద్యోగాన్ని పెంచుతున్న  నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని అనుక్షణం ప్రశ్నిస్తూ ప్రజల పక్షమై పోరాడుతున్న    నియంత నరేంద్రమోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం లు పేర్కొన్నారు. ఈ  సందర్బంగా ఆర్ డి ఓ కార్యాలయం ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించి  నరేంద్రమోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు ఏం ఏ నయిం, ప్రధాన కార్యదర్శులు తుపాకుల భాజన్న, బన్న రాజేశం, పట్టణ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహాయ కార్యదర్శి చిటిమెల్లి రంజిత్ గుప్త, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి,  కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు శ్రీరాముల అమరేందర్, ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు మంథని గంగనర్సయ్య,కాంగ్రెస్ నాయకులు జాగిలం భాస్కర్, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మ్యాదరి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.