మున్సిపాలిటీలోముగిసిన కలెక్టర్ పర్యటన మధిర ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday February 23, 2023

జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ మధిర పట్టణంలో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులు పరిశీలించారుముందుగా ట్యాంక్ బండ పనులను పరిశీలించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సమీకృత మార్కెట్ పనులను పరిశీలించి వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో చిరు వ్యాపారులకు ఏర్పాటుచేసిన బడ్డీ కొట్లను పరిశీలించి ఈ ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు ఏర్పాటు చేయబోయే నాలుగు లైన్ల రహదారి పనులను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై ప్రిన్సిపల్ సెక్రెటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మధిరలో వంద పడకల ఆసుపత్రి వద్ద నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులను, వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎప్పుడు కల్లా పూర్తి అవుతాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా అక్కడ అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన స్టేడియం పనులను పరిశీలించి దీనిని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేష్ ఎంపీడీవో కుడుములు విజయభాస్కర్ రెడ్డి కమిషనర్ అంబటి రమాదేవి మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత వైద్య ఆరోగ్యశాఖ ఈఈ ఉమామహేశ్వరరావు డిఈ శ్రీనివాసరావు మధిర ఆసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ అనిల్ ఐబి డిఈ నాగబ్రహ్మం ఏఈ వినీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.