గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న వాడుక రాజగోపాల్ సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి

Published: Wednesday May 25, 2022

మధిర రూరల్ మే 24  ప్రజా పాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ  కావాలంటే వైయస్ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర పరిశీలకులు వాడుక రాజగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు  నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులతో వైయస్ షర్మిలమ్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల ప్రసాదరావు ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ రాంబాబు నాయక్ జిల్లా మైనార్టీ సెల్ నాయకులు మదార్ సాహెబ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించాలని పార్టీ నాయకులకు ఆమె దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను వాడుక రాజగోపాల్ ఖమ్మం జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు రుణమాఫీ చేశారనే విత్తనాలు ధరలు తగ్గించాలని ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, ఎనిమిదేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.