తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అభివృద్ధి కేసీఆర్ ఎంతో కృషి చేశా

Published: Thursday July 21, 2022

ఎంతో కృషి చేశారని రాష్ట్ర ప్రజా సంక్షేమ శాఖ మంత్రులు మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తాండూరు నియోజకవర్గంలో రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో స్టడీ సెంటర్ల పెంచుటకు కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక  స్టడీ సెంటర్ ఉండేదని ఇప్పుడు అవి పది పెంచామని అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా కళాశాలను పెంచుతూ వచ్చామని చెప్పారు. స్థానిక సంస్థల నాయకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్రెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పు డు ప్రతిపాదనలు పంపించామని అప్పుడు మంజూరైన పనులు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. తాండూర్ లో 18 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం జరిగిందని మరో 18 కోట్ల రూపాయలతో వివిధ పనులకు అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయని తెలిపారు. విద్య మౌలిక సదుపాయాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఓకే అడుగుతే రాదని కొట్లాడితే వచ్చిందని అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు కల్యాణ లక్ష్మి .షాదీ ముబారక్. రైతుబంధు .దళిత బంధు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. తాండూరు శాసనసభ్యులు రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో కరుణ వ్యాధి రావడంతో అనేక రంగాల్లో అభివృద్ధి జరిగిందని కరుణ వ్యాధి పోవడంతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్నాయని అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని చెప్పారు .తాండూరులో ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు అయిందని త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తానని  చెప్పారు