వడ్డెర్లనూ ఎస్టిలో కలపాలని ఉప్పల్ ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు బో

Published: Tuesday November 29, 2022
మేడిపల్లి, నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) 
తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, చైర్మన్
శివరాత్రి అయిలమల్లు
ఆదేశాల మేరకు రాష్ట్రంలో 33 జిల్లాలోని 594 మండలాల్లో 
సుమారు 35 నుండి 40 లక్షల మంది ఉన్న వడ్డెర్లనూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎస్టిలో కలపాలని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం ఉపాధ్యక్షులు బోదాస్ నరసింహ ఉప్పల్ ఎమ్మార్వో గౌతం కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోదాస్ నరసింహ మాట్లాడుతూ మాకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం తెలంగాణ  ప్రభుత్వం తీరుస్తుందనే ఉద్దేశంతో వడ్డెర కులానికి అందించాల్సిన డిమాండ్లు వడ్డెర్లను బీసీ నుండి తొలగించి ఎస్టిలో చేర్చాలి,వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించి, కార్పొరేషన్ కు 1000 కోట్లు నిధులు ఇవ్వాలి, చదువుకునే వడ్డెర విద్యార్థిని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి,వడ్డెర కాంట్రాక్టులకు ప్రభుత్వ పనుల్లో 20 శాతం ఈఎండి లేకుండా కేటాయించాలి,వడ్డెర్లకు బండ క్వారీల పైన 20% హక్కులను కల్పించాలి.వడ్డెర కార్మికులు వృత్తిలో ప్రమాద శాత్తు మరణిస్తే వారికి 20 లక్షలు రూపాయలు గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.వడ్డెర జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించాలి, ప్రభుత్వ నామినేట్ పదవులను వడ్డెరలకు కేటాయించాలి.వడ్డెర కమ్యూనిటీ హాల్ ను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి, ఉప్పల్ భగవత్ లో ప్రభుత్వ నిర్మించబోతున్న వడ్డెర ఆత్మ గౌరవ భవనాన్ని మా సంఘం బలపరిచిన జెరిపెట్టి సత్యనారాయణ రాజు ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేపట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో వడ్డెర్లకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను తీరుస్తుందనే ఉద్దేశంతో   ఎమ్మార్వో అండ్ ఆర్డివోలకు రాష్ట్రవ్యాప్తంగా వినతి పత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ప్రతినిధులు గండికోట హరి, పల్లపు కృష్ణ, దండుగుల వెంకటేష్, ఓర్స్ శ్రీనివాస్, వరికుప్పల రవి తదితరులు పాల్గొన్నారు.