కెసిఆర్ జన్మదిన వృక్షర్చన కార్యక్రమం

Published: Wednesday February 17, 2021
టి.ఆర్.ఎస్.వి రాష్ట్ర కార్యదర్శి-ఆవాల హరిబాబు
 
ఉస్మానియా యూనివర్సిటీ-  హైదరాబాద్ ఫిబ్రవరి 16 (ప్రజాపాలన): హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టి.ఆర్.ఎస్.వి రాష్ట్ర కార్యదర్శి ఆవాల హరిబాబు ఆధ్వర్యంలో కోటి వృక్షర్చలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. హరిబాబు మాట్లాడుతూ కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని మన రాష్ట్రానికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మన ముఖ్యమంత్రి సంక్షేమ రాష్ట్రంగా అగ్రగామిగా నిలిపారని వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బండారి వీరబాబు, టీఆరేఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లమల్ల కృష్ణ, ఓయూ ఆర్.ఎస్.ఏ అద్యక్షులు నివాస్, ఓయు టి.ఆర్.ఎస్.వి నాయకులు పబ్బు కృష్ణ, కండే రమేష్, బాలు, కిశోర్, గోపి, రాజు, భరత్ తదితరులు పాలుగొన్నారు.