రాజేశ్వరపురం కోపరేటివ్ సొసైటీలో అసిస్టెంట్ రిజిష్టార్ విచారణ..

Published: Wednesday July 27, 2022
పాలేరు జూలై 26 ప్రజాపాలన ప్రతినిధి
 నేలకొండపల్లి
మండలం లోని రాజేశ్వరపురం సోసైటీ లో యూరియా మాయం పై విచారణ మరోమారు చేపట్టారు. సోసైటీ ఉపాధ్యాక్షుడు రవీందర్ యూరియా 108 బస్తాలు మాయమైన్నట్లు డీసీఓ కు ఈ నెల 23 న ఫిర్యాదు చేశారు. కాగా 24 న సీనియర్ ఇన్సెపెక్టర్ శంకర్ విచారణ చేశారు. కాగా విచారణ ఏకపక్షంగా జరిగిందని, తనకు సమాచారం ఇవ్వకుండా విచారణ చేశారని సదరు సొసైటీ ఉపాధ్యాక్షుడు రవీందర్ మరోమారు డీసీవో కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం అసిస్టెంట్ రిజిష్ట్రార్ కె. కిషోర్ విచారణ చేపట్టారు. స్టాక్ ను, రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని, సొసైటీ ఉపాధ్యాక్షుడు రవీందర్ ను. పాలకవర్గం సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నివేదిక ను డీసీవో కు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సహకార ఇన్సెపెక్టర్ శంకర్. సోసైటీ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి, డైరెక్టర్ లు దండా రంగయ్య,
పుసులూరి శ్రీనివాస్, నాగరాజు, వీరభద్రయ్య, సీఈవో
యం వీరబాబు, మాజీ సర్పంచ్ ఎర్రబోయిన నర్సయ్య తదితరులు
పాల్గొన్నారు.