సూబాబుల్ రైతులును ఆదుకోవాలి రైతుబంధు సభ్యులు చుంచువిజయ్

Published: Monday March 28, 2022
మధిర మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో ఆదివారం నాడు ఉమ్మడి జిల్లా సమస్యలు పై చర్చించిన రైతు బంధు రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేస్వరరెడ్డి మరియు ఎమ్మెల్సీ తాతా మధుని కలిసి గిట్టుబాటు ధర కల్పించాలని వినతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సూబాబుల్ రైతులను ఆదుకోవాలి అని సూబాబుల్ పంటను వెంటనే కొనుగోళ్లు చెయ్యాలి అని రైతు పీవోలు ఇవ్వాలి అని డీబార్క్ ను వెంటనే నిలుపుదల చేసి ముడి కర్రను మాత్రమే కొనుగోలు చెయ్యాలి అని కోరారు 2018లో జిల్లాలోని అన్ని పార్టీలు రైతు సంఘాలుతో జరిగిన ఒప్పందం ఐటీసీ కంపిణీ విస్మరించి రైతులను దగా చేసింది అని ఈ ఒప్పందాన్ని అమలుచేసి రైతులు దగ్గిర నుండి ముడి కర్రను వెంటనే కొనుగోలు చేసే విదంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఈ విషయం పై స్పందించిన పల్లా రాజేస్వరరెడ్డి గారు నేను రైతు సంఘాలు మురియు జిల్లా అధికారులు సమక్షంలో ఐటీసీ అధికారులును పిలిపించి సూబాబుల్ రైతులకు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో జిల్లా రైతు కన్వీనర్ నల్లమల వెంకటేస్వరారరావు రైతు బంధు సభ్యులు చుంచు విజయ్ కుమార్ పాల్గన్నారు